మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2017 (09:22 IST)

మిలాన్‌లో అనుష్క-కోహ్లీల వివాహం.. 21న రిసెప్షన్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహం అట్టహాసంగా జరుగనుంది. శ్రీలంకతో వన్డే, ట్వంటీ-20 సిరీస్‌కు దూరమైన కోహ్లీ పెళ్లి పనుల్లో బిజీ బిజీగా వున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో.. అనుష్క కూడ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహం అట్టహాసంగా జరుగనుంది. శ్రీలంకతో వన్డే, ట్వంటీ-20 సిరీస్‌కు దూరమైన కోహ్లీ పెళ్లి పనుల్లో బిజీ బిజీగా వున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో.. అనుష్క కూడా షూటింగ్‌లకు దూరంగా వుందని ప్రచారం సాగుతోంది. కాగా.. వీరు అనుష్కల వివాహం ఈ నెల 12వ తేదీన మిలాన్‌లో జరుగనుందని తెలిసింది. 
 
వీటికి బలం చేకూర్చేలా ఈ నెల పదో తేదీ నుంచి జరుగనున్న వన్డే, ట్వంటీ-20 సిరీస్‌కు విరాట్ కోహ్లీ విరామం తీసుకున్నాడు. ఇక అనుష్క కూడా ఫిబ్రవరి వరకు షూటింగ్‌లకు దూరంగా ఉండనుంది. ఇప్పటికే వీరిద్దరూ ఇటలీ వెళ్లారని.. మిలాన్‌లో 12వ తేదీ వివాహం జరుగుతుందని.. అదే 21న రిసెప్షన్ కూడా జరుగనుందని సమాచారం. 
 
అనుష్క పెళ్లి దుస్తులను ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ డిజైనర్ అనుష్క ఇంట్లోనే తిష్ట వేసిందని ఆమె పెళ్లి దుస్తులను అత్యంత సుందరంగా డిజైన్ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.