మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 26 నవంబరు 2017 (11:11 IST)

ఇవాంకా మెనూను ఖరారు చేసిన కేటీఆర్.. చెర్రీకి సూపర్ ఛాన్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో.. తెలంగాణ సర్కారు భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇవాంకా బస ఏర్పాట్లు, ఆమె తీసుకునే ఆహారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో.. తెలంగాణ సర్కారు భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇవాంకా బస ఏర్పాట్లు, ఆమె తీసుకునే ఆహారం వంటి ఇతరత్రా ఏర్పాట్లను కేసీఆర్ సర్కారు ఇప్పటికే పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఇవాంకాకు ఇచ్చే విందు మెనూను తెలంగాణ మంత్రి కేటీఆరే దగ్గరుండి ఖరారు చేశారని తెలిసింది. 
 
ప్రపంచంలోనే అతి పెద్ద డైనింగ్ టేబుల్ హాల్ కలిగిన ఫలక్ నుమా ప్యాలెస్ డైనింగ్ టేబుల్‌పై ఈ వంటకాలను ఇవాంకాతో పాటు ముఖ్యమైన అతిథులు కొందరికి వడ్డించనున్నారు. ఆమె రుచి చూసే వంటకాలను ముందుగా అమెరికా నుంచి వచ్చిన షెఫ్‌లు, ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తారు.
 
ఇకపోతే.. దేశ వ్యాప్తంగా పేరున్న షెఫ్‌లు ఈ వంటకాలను సిద్ధం చేయనున్నారు. మెనూలో హైదరాబాద్ ఫేమస్ వంటకాలైన మొగలాయి చికెన్, ఖుబానీ కా మీఠా, డ్రై ఫ్రూట్స్ ఖీల్, నాన్ రోటి, రుమాలి రోటీ, ధమ్ కి బిర్యానీ, హలీం, షీక్ కబాబ్, మటన్ మురగ్, మటన్ కోఫ్తా, మొగలాయి మటన్ వంటి మరిన్ని వెరైటీలు సిద్ధం కానున్నాయి. హైదరాబాద్ వంటకాలే కాకుండా అమెరికా రుచులను కూడా ఇందులో సిద్ధం చేయించాలని కేటీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 
 
ఇదిలా ఉంటే.. సినీ నటుడు రాంచరణ్‌కు అరుదైన అవకాశం దక్కింది. కేసీఆర్ నిర్వహిస్తున్న సదస్సుకు ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో.. ఈ సదస్సులో ప్రసంగించే అవకాశాన్ని చెర్రీ కొట్టేశాడు. ఇవాంకతో పాటుగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, సానియామీర్జా, గోపీచంద్, మిథాలీరాజ్‌, గవాస్కర్‌, మానుషి చిల్లర్‌, సోనమ్ కపూర్, అదితిరావులు కూడా తమ సందేశాలిస్తారు.