శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 మే 2017 (16:25 IST)

గాలిలో ఎగురుతూ.. పెళ్ళి ప్రపోజల్ పెట్టాడు.. బెలూన్ పగిలిపోయింది..

గాలిలో ఎగురుతూ.. సముద్రంపై తేలుతూ.. ప్రేమను వ్యక్తపరచడం ఫ్యాషనైపోయింది. ఇంకా సముద్రంపై తేలుతూ.. విమానంలో ఎగురుతూ పెళ్ళిళ్లు చేసుకోవడం కూడా మామూలైపోయింది. ఇలా ఎయిర్ బెలూన్‌లో ఎగురుతూ.. గాల్లో తేలియాడుత

గాలిలో ఎగురుతూ.. సముద్రంపై తేలుతూ.. ప్రేమను వ్యక్తపరచడం ఫ్యాషనైపోయింది. ఇంకా సముద్రంపై తేలుతూ.. విమానంలో ఎగురుతూ పెళ్ళిళ్లు చేసుకోవడం కూడా మామూలైపోయింది. ఇలా ఎయిర్ బెలూన్‌లో ఎగురుతూ.. గాల్లో తేలియాడుతున్నప్పుడు.. పెళ్లి ప్రపోజల్ చేయాలనుకున్నాడు ఓ వ్యక్తి. అంతే ఎయిర్ బెలూనే పగిలిపోయింది. అయితే ఏమైంది.. అని అడుగుతున్నారు కదూ.. అయితే చదవండి. 
 
వివరాల్లోకి వెళితే.. కెనడాలోని అల్బెర్టాలో స్టీఫెన్ మార్టిన్ అనే యువకుడు తన ప్రేయసికి ఆకాశంలో తేలియాడుతూ పెళ్లి ప్రపోజల్ పెట్టాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఈ జంట గాల్లో తేలుతుండగా "నన్ను పెళ్లి చేసుకుంటావా" అని తన ప్రియురాలు క్రిస్టిన్ పీటర్స్‌ని అడిగాడు. అందుకు ఆమె మురిసిపోతూ ఓకే చెప్పేశాడు.
 
అంతే మరుక్షణం ఢాం అంటూ ఎయిర్ బెలూన్ పేలిపోయింది. అమాంతం చెట్ల పొదల్లో పడిపోయింది. ఈ బెలూన్‌లో పైలట్‌తో పాటు 31 మంది ప్రయాణిస్తున్నారు. అయితే ఎవ్వరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీని తాలూకూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.