శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 28 జనవరి 2018 (16:48 IST)

హుదూద్ తుఫాను.. 160 ఏళ్ల నాటి కాశింకోట పాఠశాలను నిర్మించిన రాజమౌళి

బాహుబలి మేకర్ రాజమౌళి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014లో సంభవించిన హుదూద్ తుఫాను తీవ్ర నష్టాన్ని సృష్టించింది. ఈ తుఫాను తాకిడికి విశాఖ అస్తవ్యస్తమైంది. ఆపై ఏపీ సర్కారు చేపట్టిన చర

బాహుబలి మేకర్ రాజమౌళి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014లో సంభవించిన హుదూద్ తుఫాను తీవ్ర నష్టాన్ని సృష్టించింది. ఈ తుఫాను తాకిడికి విశాఖ అస్తవ్యస్తమైంది. ఆపై ఏపీ సర్కారు చేపట్టిన చర్యలు, ఎందరో పెద్ద మనసు చేసుకుని చేసిన సాయంతో ఆ నగరానికి పూర్వపు రూపరేఖలు సంతరించుకున్నాడు.
 
ఇదే తుఫానులో విశాఖలోని 160 ఏళ్ల నాటి కాశింకోట పాఠశాల చాలామటుకు కూలిపోయింది. ఈ భవనం నిర్మాణ పనులను ప్రముఖ దర్శకుడు, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి తన భుజాలపై వేసుకున్నారు. రాజమౌళితో పాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, శోభనాద్రి, ప్రశాంతి కలిసి నాలుగు గదుల భవనం నిర్మించేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ భవనం పూర్తయ్యింది. త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు.