1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rajinikanth's '2.0' BREAKS 'Baahubali 2' record

'బాహుబలి' రికార్డులు బద్ధలు కొట్టిన రజనీకాంత్ '2.0'

సూపర్ స్టార్ రజనీకాంత్ - స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం "2.0". ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ విలన్‌గా నటిస్తుండగా, అ

Rajinikanth
సూపర్ స్టార్ రజనీకాంత్ - స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన చిత్రం "2.0". ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ విలన్‌గా నటిస్తుండగా, అమీజాక్స‌న్ హీరోయిన్. 
 
అయితే, ఈ చిత్రం 'బాహుబ‌లి' రికార్డుల‌ని బ్రేక్ చేస్తుంద‌నే అంచనాలో ఉన్నారు. భారీ ఎత్తున ఆడియో వేడుక జ‌రిపిన 2.0 చిత్ర యూనిట్ ఈ మూవీని 3డీ ఫార్మాల్‌లోను విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల‌కి పసందైన విందు అందించే ప్లాన్ చేస్తుంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌కి సంబంధించిన వార్త‌లు షాకింగ్‌గా మారాయి. 
 
'రోబో-2' మలయాళ డిస్ట్రిబ్యూషన్ హక్కుల‌ను ఏకంగా 16 కోట్ల రూపాయలకు అమ్మారని సమాచారం. తెలుగు, తమిళ భాషలతో పోలిస్తే చిన్నది అయిన మలయాళీ మార్కెట్‌లో మాత్రం ఒక అనువాద సినిమా ఈ రేంజ్‌లో అమ్ముడు పోవడం ఇదే తొలి సారి అని తెలుస్తోంది. 'బాహుబ‌లి 2' రూ.10.50 కోట్లకు అమ్ముడు పోగా, మొన్న‌టివ‌ర‌కు ఇదే బెస్ట్‌గా చెప్పారు. కానీ ఆ రికార్డుని 2.0 అధిగ‌మిస్తూ స‌రికొత్త ట్రెండ్ చేస్తుంది.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మెహబూబాతో పోల్చితే పోకిరి ఫ్లాప్: రామ్ గోపాల్ వర్మ