మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 22 జనవరి 2018 (09:38 IST)

మెహబూబాతో పోల్చితే పోకిరి ఫ్లాప్: రామ్ గోపాల్ వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు డైరక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడనే విషయం తెలిసిందే. వర్మ-పూరీ అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తాజాగా తన కుమారుడు ఆకాష్‌ను హీరోగా పెట్టి 'మెహబూబా' పేరిట ఓ సినిమాకు పూరీ దర్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు డైరక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడనే విషయం తెలిసిందే. వర్మ-పూరీ అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తాజాగా తన కుమారుడు ఆకాష్‌ను హీరోగా పెట్టి 'మెహబూబా' పేరిట ఓ సినిమాకు పూరీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వర్మకు పూరీ చూపించాడు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూసిన వర్మ తనదైన శైలిలో కామెంట్లు పెట్టారు.
 
'మెహబూబా'లోని కొన్ని సన్నివేశాలను చూశానని.. ఈ సినిమాతో పోలిస్తే 'పోకిరి' ఫ్లాప్‌ అంటూ షాకింగ్ కామెంట్ ఇచ్చాడు. తన కుమారుడి మీద ఉన్న ప్రేమతో పూరీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తీశాడని ప్రశంసలు కురిపించాడు. దీనిపై పూరీ జగన్నాథ్ కూడా స్పందించారు. "మా బాస్ మొదటిసారి నన్ను చిత్ర దర్శకుడిగా గుర్తించాడు. నా జీవితంలో ఇదే పెద్ద ప్రశంస. లవ్ యు సర్" అంటూ కామెంట్ పెట్టాడు.
 
ఇదిలా ఉంటే.. రాంగోపాల్ వర్మ సంచలన దర్శకుడు. అతడు ఏం మాట్లాడినా సంచలనమే. ఓ వైపు సినిమాలు తీస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఏకంగా పోర్న్ స్టార్‌తో ఓ లఘు చిత్రాన్ని తీస్తున్నారు. అయితే ఇది ఒక సినిమా కాదని, షార్మ్ ఫిల్మ్ కాదని, వెబ్ సిరీస్ కూడా కాదని.. ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వాగతమని వర్మ చెప్తున్నారు. ఈ సినిమాపై మహిళా సంఘాలు మండిపడుతున్నప్పటికీ వర్మ తన సినిమాను విడుదల చేయడంపై మనసు పెట్టాడు.