శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2018 (13:24 IST)

సింహం కన్నా పవర్ ఫుల్ నేను.. ఎవరికీ లొంగను : వర్మ

'అత్తారింటికి దారేది' చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ చెపుతాడు. "చూడు సిద్దప్పా... నేను సింహం లాంటోడిని.. అది గడ్డం గీసుకోదు.. నేను గడ్డం గీసుకుంటాను. అంతే తేడా" అంటూ విలన్ కోట శ్రీనివాస రావుతో అం

'అత్తారింటికి దారేది' చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ చెపుతాడు. "చూడు సిద్దప్పా... నేను సింహం లాంటోడిని.. అది గడ్డం గీసుకోదు.. నేను గడ్డం గీసుకుంటాను. అంతే తేడా" అంటూ విలన్ కోట శ్రీనివాస రావుతో అంటాడు. 
 
ఇపుడు అచ్చం ఇలాంటి డైలాగునే దర్శకుడు రాంగోపాల్ వర్మ చెపుతున్నాడు. 'గాడ్‌, సెక్స్‌, ట్రూత్' (జీఎస్టీ) పేరుతో ఆయన ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం త్వరలోనే విడుదలకానుంది. అదేసమయంలో ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది. 
 
శృంగారమే ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా విషయంలోనే కాకుండా ఏ విషయంలోనూ తాను ఎవరికీ లొంగబోనని తాజాగా రామ్ గోపాల్‌ వర్మ అన్నారు. "తాను సింహంలాంటి వాడిని కాదని, దాని కన్నా పవర్ ఫుల్" అని చురకలంటించారు. 
 
ఈ సినిమాకి గాడ్‌, సెక్స్‌, ట్రూత్ (జీఎస్టీ) అని పేరు పెట్టడానికి కారణం శృంగారాన్ని దేవుడే క్రియేట్ చేశాడని చెప్పడమేనని వర్మ చెప్పారు. గాడ్ క్రియేట్ చేసిన సెక్సుని తప్పని, స్త్రీలు ముడుచుకుని ఉండాలని ఇలా ఎన్నో భావాలను ప్రజలే సృష్టించారన్నారు.