శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 17 జనవరి 2018 (12:41 IST)

సంక్రాంతి కోడి పందేలు.. రూ.400 కోట్లు చేతులు మారాయట?

సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్ర ప్రజలు అట్టహాసంగా జరుపుకున్నారు. భోగి, సంకాంత్రి, కనుమ పండుగలను పురస్కరించుకుని మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేలు, పేకాటలు, గుండాటలు, పొట్టేళ్ల పోటీలు కను

సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్ర ప్రజలు అట్టహాసంగా జరుపుకున్నారు. భోగి, సంకాంత్రి, కనుమ పండుగలను పురస్కరించుకుని మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేలు, పేకాటలు, గుండాటలు, పొట్టేళ్ల పోటీలు కనువిందు చేశాయి. ఏపీలో అయితే కోడి పందేల మాటున కోట్లాది రూపాయలు మారాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి నిర్వహించిన పందెం మాటున నాలుగు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి.
 
గోదావరి, కృష్ణా జిల్లాల్లో అయితే చెప్పనక్కర్లేదు. పండుగ మూడు రోజులు మొత్తం రూ.400 కోట్లు చేతులు మారగా, ఒక్క కృష్ణా జిల్లాలోనే రూ.200 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. దీంతో కోటీశ్వరులు లబోదిబోమంటున్నారు. ఈ  కోడి పందేల నిర్వహణకు అడ్డుకట్ట వేసేందుకు సర్కారు, పోలీసులు తీసుకున్న చర్యలు పనిచేయలేకపోయాయి. పెనమలూరులో రూ.500 నుంచి రూ.50 లక్షల వరకు కోళ్లపై పందేలు కాశారని అధికారులు తెలిపారు.