శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 16 జనవరి 2018 (13:32 IST)

జన్మభూమిని మరిచిపోయిన వారు మనుషులే కాదు: చంద్రబాబునాయుడు

చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో పలు అభివృద్థి కార్యక్రమాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. 6 కోట్ల రూపాయలతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రం, నారావారిపల్లి నుంచి పుదిపట్లకు నాలుగురోడ్ల విస్తరణ పనులను ప్రారంభించారు. చిత్తూరు జిల్లాను

చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో పలు అభివృద్థి కార్యక్రమాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. 6 కోట్ల రూపాయలతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రం, నారావారిపల్లి నుంచి పుదిపట్లకు నాలుగురోడ్ల విస్తరణ పనులను ప్రారంభించారు. చిత్తూరు జిల్లాను అన్నివిధాలుగా అభివృద్థి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. మదనపల్లి టమోటా హబ్‌గా మారుతోందని, కుప్పంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను త్వరలో ప్రారంభిస్తామని, హంద్రీ-నీవా ద్వారా వచ్చే సంవత్సరంలో తాగు, సాగునీరు అందిస్తామని, సోమశిల-స్వర్ణముఖి, బాలాజీరిజర్వాయర్, స్వర్ణముఖి రిజర్వాయర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. 
 
గ్రామస్థాయిలో పర్యాటక శాఖను అభివృద్ధి చేస్తామని, సాంప్రదాయాలు ఫాలో కాకుండా, వారసత్వాలు వదులుకుంటే ఇబ్బంది పడతారని, సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకోవాలి, అదే మనకు ఆస్తి అని, జన్మభూమికి సేవలందించాలని, కరువు రహిత జిల్లాగా చిత్తూరును మారుస్తామని చెప్పారు. జన్మభూమిని మరిచిపోయిన వారు మనుషులే కాదని అన్నారు. నెల్లూరులో ఎయిర్‌పోర్ట్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, ఎపిలోని అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ళస్థలాలు, ఇళ్ళనిర్మాణం చేపట్టి అందిస్తామని, మారుమూల గ్రామాల్లో నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తామని చెప్పారు. 
 
ఈ నెల 26వ తేదీన వైజాగ్‌లో పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహిస్తామని, ఎపిలో కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. ఎపిలో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపీట వేశామని, నకిలీ విత్తనాలు, క్రిమిసంహారక మందులను సరఫరా చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.