1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. HHVM: Udaya Bhanu’s ignorant comment goes viral

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

Udaya Bhanu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరువు తీసింది యాంకర్ ఉదయభాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా అనేక అడ్డంకులు పడుతూ ఇబ్బందుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 12న విడుదలని చెప్పి ఆ విడుదల తేదీని కూడా వాయిదా వేసేశారు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. 
 
అయితే ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమాకి డైరెక్టర్‌గా పనిచేసిన జ్యోతి కృష్ణ ఓ ప్రైవేట్ ఈవెంట్ పెట్టారు. ఈ సినిమాలోని ఒక పాట పవన్ కళ్యాణ్‌కి చాలా ఇష్టం. ఆ పాట ఆయన దాదాపు 500 సార్ల వరకు చూసి ఉంటారు.. అంటూ లైవ్ లోనే ఆ పాటని ప్లే చేయించారు.
 
దీనిపై ఉదయభాను పవన్ కళ్యాణ్ పరువు గంగలో కలిపేసింది. ఎందుకంటే పాట ప్లే చేస్తుండగా మధ్యలోకి వచ్చి పవన్ కళ్యాణ్ 500 సార్లు ఆ పాటను చూశారంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓ పాట పాడే ఉంటారు. ఆ రహస్యాన్ని మీరు దాచేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాడిన ఆ పాట ఏంటో మీరు చెప్పాల్సిందే అంటూ మాట్లాడింది. 
 
కానీ హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ మాట వినాలి అనే పాట పాడారు. ఈ పాట కూడా ఎప్పుడో విడుదలైంది. అయితే అలా విడుదలైన విషయం కూడా ఉదయభానుకి తెలియకపోవడం నిజంగా పవన్ కళ్యాణ్‌కి ఆయన అభిమానులకి అవమానమే అంటున్నారు చాలామంది ఈ వీడియో చూసిన నెటిజన్స్.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన