మంగళవారం, 15 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : సోమవారం, 14 ఏప్రియల్ 2025 (11:34 IST)

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

SathyaRaj, meghana
SathyaRaj, meghana
బాహుబలి ఫేమ్ సత్యరాజ్ ప్రముఖ పాత్రలో నటించిన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్’.  డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీం బిజీగా ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ అలరించింది. పాటలు, టీజర్, గ్లింప్స్ ఇలా ప్రతీ ఒక్కటీ ఆడియెన్స్‌లో సినిమా పట్ల ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రెండ్‌ను ఫాలో అయ్యారు సత్యరాజ్.
 
‘అనగా అనగా కథలా’ అనే పాట ఈ మధ్య రిలీజ్ అయి యూట్యూబ్‌లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాత, మనవరాలి మధ్య ఉండే బాండింగ్‌ను చూపించేలా ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట ప్రమోషన్స్‌లో భాగంగా సత్యరాజ్ రీల్స్ చేశారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో హీరోయిన్లంతా కూడా రీల్స్ చేస్తుండగా.. సత్యరాజ్ సైతం ఈ ట్రెండ్‌లో పాల్గొన్నారు. త్రిబాణధారి బార్బరిక్ సినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేస్తున్నారు. 
 
ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి వారు నటించారు. ఇక త్వరలోనే మేకర్లు రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
 
తారాగణం: సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్రన్, మరియు మేఘన