సంబంధిత వార్తలు
- త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్
- మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల
- త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్
- Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్
- Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు
పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్
Satharaj, Rajesh
ప్రస్తుతం త్రిబాణధారి బార్బరిక్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవలె సినిమాను చూసిన టీం ఎంతో సంతోషంగా ఉంది. చిత్రం అద్భుతంగా వచ్చిందన్న కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు. పైగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా జనాల్లోకి బాగా రీచ్ అయ్యాయి. సత్య రాజ్ చేస్తున్న ప్రమోషన్స్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. కంటెంట్ మీద, సినిమా మీదున్న నమ్మకంతో సత్య రాజ్ ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
అనగా అనగా కథలా అనే పాటతో సత్య రాజ్ ఎమోషనల్‌గా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి వారు నటించారు. ఇక ఉదయ భాను నెగెటివ్ షేడ్స్ ఉన్న కారెక్టర్ ద్వారా సినిమా మరింత ఇంట్రెస్టింగ్‌గా మారనుందని సమాచారం. ఓ మంచి రిలీజ్ డేట్ కోసం చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. త్వరలోనే సరైన విడుదల తేదీని టీం ప్రకటించనుంది.
