త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్
ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్. ఆహా ఓటీటీలో సూపర్ హిట్టయిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. ఈ సిరీస్ ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా..కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు.
ఈ రోజు త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి యాక్ట్రెస్ కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్ చేశారు. కుషిత కల్లపు క్యారెక్టర్ బోల్డ్, ఫియర్స్, గ్లామరస్ గా ఉండి ఆకట్టుకుంటోంది. త్రీ రోజెస్ సీజన్ 2 కు ఆమె క్యారెక్టర్ వన్ ఆఫ్ ది అట్రాక్షన్ కాబోతోంది. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ఈ సిరీస్ లో కుషితకు కీలకమైన క్యారెక్టర్ ఇచ్చారు. కుషితకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. త్రీ రోజెస్ సీజన్ 2 లో ఆమె క్యారెక్టర్ వైవిధ్యంగా ఉంటూ, యూత్ ను బాగా ఆకట్టుకునేలా వైరల్ కంటెంట్ తో ఉండనుంది. ఇప్పటికే త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి రిలీజ్ చేసిన హీరోయిన్ ఈషా రెబ్బా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే త్రీ రోజెస్ సీజన్ 2 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.