సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 17 జనవరి 2018 (16:15 IST)

హీరోలతో పోటీకి సై అంటోన్న భాగమతి: బ్లాక్‌బస్టర్ ఖాయమా?

''పిల్ల జమీందారు'' ఫేమ్ దర్శకుడు అశోక్ దర్శకత్వంలో... యూవీ క్రియేషన్స్ సంస్థ రూపొందించిన సినిమా భాగమతి. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటిక

''పిల్ల జమీందారు'' ఫేమ్ దర్శకుడు అశోక్ దర్శకత్వంలో... యూవీ క్రియేషన్స్ సంస్థ రూపొందించిన సినిమా భాగమతి. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఆడియోను ముందుగా చెన్నైలో నిర్వహిస్తారని టాక్. తర్వాత తెలుగులోనూ ఈ చిత్రం ఆడియో విడుదలవుతుందని సమాచారం.
 
ఇక జనవరి 26వ తేదీన భాగమతి విడుదల కానున్న నేపథ్యంలో.. అదే రోజున మంచు విష్ణు నటించిన – ఆచారి అమెరికా యాత్ర, మహేశ్ బాబు సోదరి మంజుల దర్శకత్వంలో సందీప్ కిషన్ నటించిన ''మనసుకు నచ్చింది'', విశాల్ హీరోగా చేసిన ''అభిమన్యుడు'', జయం రవి, నివేదా పెతురాజ్ నటించిన సైన్స్ ఫిక్షన్ "టిక్ టిక్ టిక్" విడుదలవుతున్నాయి. 
 
అయితే, అరుంధతి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనుష్క"భాగమతి" మూవీతో మళ్లీ అలాంటి మెగా బ్లాక్ బస్టర్ సినిమా ఇస్తుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. తద్వారా హీరోలతో అనుష్క పోటీ పడుతుందని సినీ జనం అంటున్నారు.