మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (16:06 IST)

సన్నీలియోన్ వచ్చేస్తోంది.. తలపట్టుకున్న కోలీవుడ్ భామలు..

ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుని దక్షిణాదిన కాలు మోపిన పోర్న్ స్టార్ కమ్ బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో లేడి ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. బాలీవుడ్ శృంగార తార అయిన సన్నీలి

ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుని దక్షిణాదిన కాలు మోపిన పోర్న్ స్టార్ కమ్ బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో లేడి ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. బాలీవుడ్ శృంగార తార అయిన సన్నీలియోన్ తెలుగులో ఓ ఫాంటసీ చిత్రంలో నటించనుంది. వడి ఉదయన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుండగా.. దీనికి 'వీరమహాదేవీ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. 
 
ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కబోతోంది. 2018లో ఈ చిత్రం తెరమీదకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సన్నీ దక్షిణాది అడుగుపెట్టడంతో.. కోలీవుడ్ భామలు తలపట్టుకుని కూర్చున్నారట. 
 
సన్నీ నటించే ''వీరమహాదేవి'' తమిళ సినిమా కోసం అగ్రహీరోయిన్ నయనతారకు ఇచ్చే పారితోషికాన్ని ఇస్తున్నారని తేలింది. ఇలా సన్నీ డిమాండ్ పెరిగితే కోలీవుడ్‌లో మన పరిస్థితి ఏంటని కోలీవుడ్ అగ్ర హీరోయిన్లు తెగ బాధపడిపోతున్నారని టాక్ వస్తోంది. దక్షిణాదిన అధిక పారితోషికం తీసుకునే నయనతార, అనుష్కల కంటే ఎక్కువ సన్నీ వీర మహాదేవికి తీసుకున్నట్లు కూడా కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.