శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2017 (09:14 IST)

పవర్ స్టార్ కంటే సన్నీలియోన్ అంటేనే ఎక్కువ గౌరవం: వర్మ.. సీన్లోకి కత్తి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే గ్లామర్ క్వీన్ సన్నీలియోన్ అంటేనే తనకు ఎక్కువ గౌరవమని ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. పవర్ స్టార్ ఇటీవల ఏపీలో పర్యటించిన సందర్భంగా చేసిన ప్రసంగం తనను

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే గ్లామర్ క్వీన్ సన్నీలియోన్ అంటేనే తనకు ఎక్కువ గౌరవమని ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. పవర్ స్టార్ ఇటీవల ఏపీలో పర్యటించిన సందర్భంగా చేసిన ప్రసంగం తనను ఎంతో ఆకట్టుకుందని వర్మ తెలిపారు. సన్నీలియోన్ జాతీయ స్థాయి సెలెబ్రిటీ అని.. పవన్ కల్యాణ్ ప్రాంతీయ సెలెబ్రిటీ అన్నారు. 
 
యావత్తు భారతదేశంలో మోస్ట్ పాపులర్ పర్సన్ సన్నీలియోన్ అని.. ఈ విషయంపై ఎవరూ చర్చించాల్సిన అవసరం లేదని చెప్పారు. సమాజం కోసం పాటుపడతానని చెప్తున్న పవన్ కంటే సన్నీ ఇంకా ఎక్కువగా సమాజం కోసం పాటుపడతానని తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వార్ జరుగుతూనే వున్న సంగతి తెలిసిందే. సమయం దొరికితే చాలు ప్రతీసారి పవన్ కళ్యాణ్ మీద, ఆయన ఫ్యాన్స్ మీద మహేష్ కత్తి విమర్శలు గుప్పిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ కత్తికి ''అజ్ఞాతవాసి'' ఆడియో వేడుక సందర్భంగా సీరియస్ వార్నింగ్‌లు వచ్చాయి. 
 
అజ్ఞాతవాసి ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలనుండి భారీ స్థాయిలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ అభిమానులు మహేష్ కత్తిపై ఫైర్ అయ్యారు. మీడియా ముందుకు వచ్చి మరీ మహేష్ కత్తిని చంపేస్తాం అంటూ గట్టి వార్నింగ్‌లు ఇచ్చేశారు.
 
అయితే పవర్ స్టార్ పేరులోని పవర్‌ని వాడుకునే ఇలాంటి సైకోలు అవసరమా? అంటూ పవన్ అభిమానులు తనను చంపేస్తా అంటూ వార్నింగ్‌లు ఇస్తున్న పోస్ట్‌ల స్క్రీన్ షాట్‌లను ఫేస్ బుక్‌లో మహేష్ కత్తి షేర్ చేశాడు. ఉన్మాదానికి ఒక ఉదాహరణ ఇదంటూ.. మహేష్ కత్తి కామెంట్ చేశాడు.