శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2017 (17:29 IST)

డిసెంబర్ 31న అజ్ఞాతవాసిలో పవన్ పాడిన పాట రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో వేడుక మంగళవారం జరిగింది. అయితే కొత్త సంవత్సరం కానుకగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వనున్నారు. అజ్ఞాతవాస

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో వేడుక మంగళవారం జరిగింది. అయితే కొత్త సంవత్సరం కానుకగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వనున్నారు. అజ్ఞాతవాసి కోసం పవన్ పాడిన పాటను డిసెంబర్ 31న రిలీజ్ చేయనున్నారు. 
 
అత్తారింటికిదారేది సినిమాలో కాటమరాయుడు పాట పాడిన పవన్ కల్యాణ్.. 'అజ్ఞాతవాసి'లోనూ ఓ పాట పాడాడని తెలిసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆ పాట ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31న ఈ పాటను విడుదల చేయనున్నట్లు సినీ యూనిట్ వర్గాల సమాచారం.
 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్  హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.