శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 14 జనవరి 2018 (15:44 IST)

మళ్లీ పెళ్లి చేసుకోనున్న విరుష్క దంపతులు

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు మరోమారు పెళ్లి చేసుకోనున్నారు. వాస్తవానికి వీరిద్దరూ గత నెలలో ఇటలీలోని టస్కనీలో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఢిల్లీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు మరోమారు పెళ్లి చేసుకోనున్నారు. వాస్తవానికి వీరిద్దరూ గత నెలలో ఇటలీలోని టస్కనీలో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఢిల్లీ, ముంబైలలో అదిరిపోయేలా విందు ఏర్పాటు చేశారు. 
 
ఈ నేపథ్యంలో వీరిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఇటలీలో పెళ్లి చేసుకోవడంతో, వీరికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు భారత అధికారులు నిరాకరించినట్టు సమాచారం.
 
దీంతో పెళ్లి ధ్రువీకరణ కోసం విరుష్క దంపతులు భారత్‌లోని మరోమారు పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో విరాట్ ఉండగా, అనుష్క ఇటీవలే హనీమూన్‌ను ముగించుకుని ముంబై వచ్చేసింది. మరోసారి వివాహంపై ఈ జంట నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.