వంటకాల్లో నిమ్మకాయను వాడితే...
నిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనిషి దైనందిన జీవితంలో నిమ్మకాయ అవసరం ఎంతో అవసరమైందిగా మారిపోయింది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నిమ్మకాయను వంటల్లో వాడితే ఆ వంటల రుచే వేరు. అలాంటి నిమ్మకాయ వల్ల కలిగే ఉపయోగాలేంటో పరిశీలిద్ధాం.
* నిమ్మరసాన్ని వంటకాల్లో ఉపయోగించటం, నిమ్మకాయలతో ఊరగాయలు చేయటం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.
* నిమ్మ రసంలో ఉండే విటమిన్ల కంటే నిమ్మతొక్కలో ఎక్కువ విటమిన్లు ఉంటాయి.
* నిమ్మకాయ నుంచి రసం తీశాక ఆ తొక్కతో చర్మాన్ని శుభ్రం చేసుకోవచ్చు.
* నిమ్మతొక్కతో ముఖాన్ని రబ్ చేస్తే మట్టి తొలగిపోవటంతో పాటు చర్మం కాంతివంతమవుతుంది.
* కురుల ఆరోగ్యానికి నిమ్మకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది... ఇది చుండ్రు నివారిణి.
* నిమ్మకాయ కేన్సర్ నివారిణి మంచి పేరు. ఊపిరిత్తులు, ప్రొస్టేట్, బ్రెస్ట్ వంటి మరో 9 రకాల క్యాన్సర్స్‌ను తరిమేసే అద్భుత ఔషధం.
* కీమోథెరపీ కంటే సమర్థవంతంగా నిమ్మకాయ పని చేస్తుంది.
* బాక్టీరియా, శిలీంధ్రాల నాశినిగా నిమ్మకాయ పనిచేస్తుంది. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్స్‌ను రాకుండా చేస్తుంది.
* నిమ్మరసం వల్ల రక్తపోటును క్రమబద్ధీకరించవచ్చు.
* అందుకే నిమ్మకాయల్ని దైనందిన ఆహారంలో భాగంగా చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.