పుదీనా పేస్ట్, టమోటా గుజ్జుతో నల్లటి వలయాలు..?
పుదీనాతో అందం ఎలా పొందాలంటే.. పుదీనా ఆకులను పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి రోజంతా ఫ్రిజ్‌లో పెట్టి మరునాడు ఉదయాన్నే పుదీనా మిశ్రమంలో దూదిని ముంచి కళ్ల కొంద రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయి.
పుదీనా మిశ్రంలో బంగాళాదుంప రసం, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. మెుటిమలు, నల్లటి మచ్చల వలన ముఖం ముడతలుగా మారుతుంది. అందుకు ఇలా చేస్తే... పుదీనా మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం, పాలు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.
గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా పేస్ట్‌లో కొద్దిగా టమోటా గుజ్జు, ఉప్పు, నిమ్మరసం కలిపి కంటి కింద రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. దాంతో కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోయి ముఖం మృదువుగా, తెల్లగా మారుతుంది.
పుదీనా మిశ్రమంలో కొద్దిగా శెనగపిండి, పసుపు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన ముఖం ముడతలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. దాంతో రక్తప్రసరణ కూడా సాఫిగా జరుగుతుంది. పుదీనా అందానికే కాదు.. ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.