ఓట్స్ పిల్లల ఆరోగ్యానికి ఎంత మంచిదో.. అందానికి కూడా అంత మంచిది. మరి ఈ ఓట్స్‌తో ఫేస్‌ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. ఓట్స్‌ను పొడిచేసుకుని అందులో కొద్దిగా చక్కెర, పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. నారింజ తొక్కలను పొడిచేసుకుని అందులో కొద్దిగా పాలు, తేనె, వంటసోడా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల...