సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 19 అక్టోబరు 2018 (14:23 IST)

నారింజ తొక్క పొడి సున్నిపిండితో స్నానం చేస్తే..?

కమలాపండులో ప్రోటీన్స్, మినరల్స్, క్యాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కమలాపండును జ్యూస్‌ రూపంలో తీసుకోవడం కంటే అలానే తీసుకుంటే రక్తపోటు వ్యాధి అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధినిరోధక శక్తిని పెంచుటకు కమలా దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 
కమలాలోని ఫోలిక్ యాసిడ్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ముత్రాపిండాల్లోని రాళ్లను కరిగించుటకు ఇలా చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. కమలా తొక్కలను ఎండబెట్టుకుని పొడిచేసి ప్రతిరోజూ గ్లాస్ నీటిలో కొద్దిగా చక్కెర వేసుకుని తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు తగ్గుముఖం పడుతాయి. 
 
అధిక బరువును తగ్గిస్తుంది. ఆస్తమా, క్షయ వ్యాధిగ్రస్తులకు మంచి టానిక్‌లా ఉపయోగపడుతుంది. కమలాలోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ వ్యాధులకు నివారిస్తాయి. నారింజలోని విటమిన్ సి అసిడిటీని తగ్గిస్తుంది. సంతాన సాఫల్యతను కలిగించే గుణాలు కమలాలో పుష్కలంగా ఉన్నాయి. నారింజ తొక్క పొడిని సున్నిపిండితో కలిపి స్నానం చేస్తే చర్మ దురదలు తొలగిపోతాయి.