శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Modified: సోమవారం, 15 అక్టోబరు 2018 (22:06 IST)

ఈ ఐదు రసాలను తీసుకుంటే చాలు... ఏం జరుగుతుంది?

మనిషన్నాక ఆకలి, నిస్సత్తువ, ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇలాంటివాటికి ప్రతిసారీ వైద్యుల వద్దకు వెళ్లక్కర్లేదు. మనకు తెలిసిన కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.
 
1. పుదీనా రసం 
కడుపుబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలకు నీటివో పుదీనా ఆకులు వేసి బాగా మరిగించి చల్లార్చి తాగడం మంచిది. 
 
2. చింతపండు రసం
ఆకలి తక్కువగా ఉన్నవారు చింతపండు రసంతో చేసిన రసాన్ని అన్నంలోకి తీసుకోండి.
 
3. బత్తాయి పండ్ల రసం
అలసట లేకుండా ఉత్సాహంగా ఉండాలంటే ప్రతిరోజూ కొబ్బరి నీళ్లను, లేదా బత్తాయి పండ్ల రసాన్ని ఒక గ్లాసుడు తీసుకోండి.
 
4. కాకరకాయ రసం 
ప్రతిరోజూ కాకరకాయ రసాన్ని పుక్కిలిస్తూ ఉంటే నోట్లో నాలుక పూత, పళ్లు పుచ్చిపోవడాన్ని అరికట్టవచ్చు.
 
5. కరక్కాయ రసం
ఒక పచ్చి కరక్కాయను అరగదీసి దాని రసాన్ని తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది.