శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (15:57 IST)

బీట్ రూట్ ముక్కల్ని నిమ్మరసంలో ముంచి తీసుకుంటే?

రోజూ బీట్ రూట్ జ్యూస్ తీసుకుంటే అందులోని యాంటీ-యాక్సిడెంట్లు క్యాన్సర్ కణితులను నశింపజేస్తుంది.

రోజూ బీట్ రూట్ జ్యూస్ తీసుకుంటే అందులోని యాంటీ-యాక్సిడెంట్లు క్యాన్సర్ కణితులను నశింపజేస్తుంది. బీట్ రూట్‌లో మెగ్నీషియం, ఐరన్, సోడియం, పొటాషియం, క్లోరిన్, విటమిన్ సి, నైట్రేట్స్ పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బీట్‌రూట్‌ కంటికి, శరీరానికి చల్లదనాన్నిస్తుంది. రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 
 
క్యాన్సర్‌కు దివ్యౌషధంగా పనిచేసే ఈ బీట్‌రూట్‌ ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అలాగే చర్మ సమస్యలను దూరం చేస్తుంది. బీట్ రూట్ రసాన్ని చర్మ సమస్యలున్న ప్రాంతంలో రాస్తే ఉపశమనం లభిస్తుంది. రక్తహీనతకు చెక్ పెట్టే బీట్ రూట్ శరీర బరువును నియంత్రిస్తుంది. చర్మ కాంతిని పెంపొందింపజేస్తుంది. యూరీనరీ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. కాలిన గాయాలపై బీట్ రూట్ రసాన్ని పూస్తే త్వరలోనే మానిపోతాయి. అజీర్ణ సమస్యలను నయం చేస్తుంది.  
 
బీట్ రూట్ ముక్కలను నిమ్మరసంలో ముంచి తీసుకుంటే రక్తంలో బ్లడ్ సెల్స్ సంఖ్య పెరుగుతుంది. బీట్ రూట్ రసాన్ని.. కీరదోస రసంతో కలిపి తీసుకుంటే మూత్రాశయం శుభ్రమవుతుందని వైద్యులు చెప్తున్నారు.