గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (11:50 IST)

రాజ్మా, బొబ్బర్లను కూరలో వాడుకుంటే..?

రాజ్మా, బొబ్బర్లను కూరల్లో వాడుకుంటే.. లేదంటే ఉడికించి సాయంత్రం పూట స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది

రాజ్మా, బొబ్బర్లను కూరల్లో వాడుకుంటే.. లేదంటే ఉడికించి సాయంత్రం పూట స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బొబ్బర్లను ఉడికించి గుగ్గిళ్లుగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి తగిన పోషకాలు అందుతాయి. వీటిలో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్‌ ఎ, బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌-కె, విటమిన్‌-సి, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వవు. 
 
ఇంకా బొబ్బర్లలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా వుండటంతో.. గర్భిణులు వీటిని తరచుగా తీసుకుంటే పుట్టబోయే పిల్లలకు నాడీ లోపాలు రావు. చర్మ సమస్యలు దూరమవుతాయి. జుత్తు ఒత్తుగా పెరగడానికి బొబ్బర్లు ఉపయోగపడతాయి. ఇవి రక్తంలో చక్కెరస్థాయిని నియంత్రిస్తాయి.
 
అలాగే రాజ్మా కూరల్లోనూ, సూప్స్‌ తయారీలోనూ, ఇతర వంటకాల్లోనూ వాడతారు. రాజ్మాలో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్-బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌-ఇ, విటమిన్‌-కె, విటమిన్‌-సి, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, జింక్, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
 
రాజ్మా కండరాల పెరుగుదలకు దోహదపడుతుంది. రక్తహీనతను అరికడుతుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మైగ్రేన్‌ తలనొప్పిని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.