శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 12 అక్టోబరు 2018 (21:30 IST)

రోజూ ఒక గుడ్డు తీసుకుంటే మగవారు ఇక అందులో వెరీగుడ్డే

ఉరుకుల పరుగుల జీవితంలో శృంగారం మీద ఆసక్తి తగ్గడానికి మానసికపరమైన సమస్యలతో పాటు, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. కానీ చాలామందిలో ఎటువంటి సమస్యలు కనపడవు. అయినా వారిలో ఆ విషయంలో నిస్సత్తువ ఆవరిస్తుంది. క్రమంతప్పకుండా వ్యాయామం, ఒత్తిడికి దూరంగా ఉండటంతో పాటు తీసుకునే ఆహారంలో ఈ క్రిందవి తప్పకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే ఆ శక్తికి తిరుగుండదు.
గింజధాన్యాలు : బాదం, జీడిపప్పు, అక్రోట్స్ వంటి  గింజలు క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల లైంగిక పటుత్వం పెరుగుతుంది. అంతేకాదు వీటిల్లో సంతాన సామర్థ్యాలను పెంచే సెలీనియం, జింక్‌తో పాటు బోలెడన్ని పోషకాలు ఉంటాయి.
 
కోడిగుడ్లు : రోజంతా పనిచేసి అలసిపోవడం కూడా శృంగారంపై ఆసక్తి తగ్గడానికి మరో కారణం కావచ్చు. ప్రొటీన్లు దండిగా ఉండే గుడ్లు శృంగారంలో త్వరగా అలసిపోకుండా చూస్తాయి. కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకోవడానికి తోడ్పడతాయి. మగవారిలో స్తంభన లోపం బారిన పడకుండా చూసే ఆమైన్ ఆమ్లాలు గుడ్లులో లభిస్తాయి. రోజూ ఉదయం ఒక గుడ్డు తీసుకుంటే ఇక అందులో వెరీగుడ్డే....  
 
స్ట్రాబెర్రీ : వీటి గింజల్లో జింక్ మోతాదు ఎక్కువ. వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టీరాన్‌ను జింక్ నియంత్రిస్తుంది. శృంగార కోరికనూ ఉత్తేజితం చేస్తుంది. మిగతా పండ్ల మాదిరిగా కాకుండా స్ట్రాబెర్రీలను గింజలతో పాటు తింటూ ఉంటాం కాబట్టి జింక్ కూడా దండిగా లభిస్తుందన్నమాట. స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు లైంగిక అవయవాలకు రక్త సరఫరా బాగా జరిగేలా చూస్తాయి. ఫలితంగా అంగస్తంభన సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి.
 
కాఫీ : ఓ కప్పు కాఫీలో లభించేటువంటి కెఫైన్‌ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. ఇది బ్లడ్ పంపింగ్‌ని మెరుగుపరచి ఫ్యాట్ స్టోర్స్‌ని విడుదల చేయడం ద్వారా శృంగార సమయంలో త్వరగా అలసిపోకుండా చేస్తుంది.