శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 12 అక్టోబరు 2018 (11:35 IST)

తేనెకి అంత పవర్ వుందా? మగాళ్లు తీసుకుంటే...

తేనె. దీన్ని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటారు. ఔషధ తయారీలో వుపయోగించే ఈ తేనెలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా కలిగివుంటాయి. తేనె పురుషుల్లో శృంగార సామర్థ్యాన్నిపెంచుతుంది. పురుషుల్లో ఫెర్టిలిటీని పెంచేందుకు తేనె ఉపయోగపడుతుంది. అందుకే పురుషులు తప్పకుండా తేనె తీసుకోవాలంటారు వైద్యులు.
 
తేనెలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, యాంటీ పారాసిటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, సోడియం, కాపర్, ఐరన్, మ్యాంగనీస్, సల్ఫర్, జింక్ మరియు ఫాస్ఫేట్ వంటి లక్షణాలు తేనెలో పుష్కలంగా ఉన్నాయి. 
 
తేనె దగ్గు, గొంతునొప్పి, స్వరపేటిక వాప, ఎక్జిమా, వికారం, కడుపు పూతలను నివారిస్తుంది. అంతేగాకుండా.. చర్మానికి చెందిన అంటువ్యాధులను, చిన్న గాయాలను, కాలిన గాయాలకు తేనె దివ్యౌషధంగా పనిచేస్తుంది.