శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 13 అక్టోబరు 2018 (17:43 IST)

కంటి అలసటకు చెక్ పెట్టే.. వ్యాయామం ఎలా..?

కొందరికి కంటి అలసట వలన కళ్లు మంటగా ఉంటాయి. ఏం చేసినా ఆ మంటలు పోవడం లేదు. మనం ప్రతిరోజూ శరీర వ్యాయామం ఎలా చేస్తామో.. అదేవిధంగా కంటి కూడా చిన్న వ్యాయామం పాటిస్తే కంటి మంటలు, అలసట వీటీ వలన నల్లటి వలయాలు ఏర్పడడం వంటి సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
ఆ వ్యాయామం ఎలా చేయాలంటే.. కనుగుడ్లను గుండ్రంగా తిప్పాలి. ఆ తరువాత ఎడమవైపు, కుడివైపుకు 5 నిమిషాల పాటు తిప్పాలి. ఇలా తరచుగా చేయడం వలన కళ్ళ వేడి తగ్గుముఖం పడుతుంది. అలానే ఈ బ్యూటీ టిప్ పాటిస్తే కంటి కింద ఏర్పడే నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి.

అదేంటంటే.. గులాబీ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి అందులో దూదిని ముంచి కళ్ళపై ఉంచుకోవాలి. ఇలా చేస్తే కూడా కంటి అలసట తగ్గుతుంది.