మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (12:46 IST)

కీరదోస, పెరుగుతో ఫేస్‌ప్యాక్..?

కీరదోస కంటి అలసటను తగ్గించుటకు ఉపయోగపడుతుంది. కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కంటిపై పెట్టుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. శరీర వేడిని తగ్గిస్తుంది.

కీరదోస కంటి అలసటను తగ్గించుటకు ఉపయోగపడుతుంది. కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కంటిపై పెట్టుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. శరీర వేడిని తగ్గిస్తుంది. కొందరికి కంటి అలసట వలన కంటి కింద నల్లటి వలయాలు ఎక్కువగా ఉంటాయి. వీటి వలన ముఖం చూడడానికి విసుగుగా ఉంటుందా.. అయితే ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
కీరదోస మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం, పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం అలసట తొలగిపోయి తాజాగా మారుతుంది. అలానే కీరదోస రసంలో దూదిని ముంచుకుని ముఖానికి మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖం మృదువుగా ఉంటుంది. 
 
కీరదోస రసంలో కొద్దిగా చక్కెర, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. తద్వారా మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. కీరదోస మిశ్రమంలో కొద్దిగా గుడ్డు సొన, రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం ముడతలు తొలగిపోతాయి.