శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : శనివారం, 13 అక్టోబరు 2018 (13:07 IST)

స్లిమ్‌గా ఉండాలంటే.. బాదం చిల్లీ ఎలా..?

బాదం పప్పులో ప్రోటీన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది. ప్రతిరోజూ బాదం పప్పులను తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మరి ఈ బాదంతో చిల్లీ ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
బాదం పప్పు - 6
యాపిల్ - 1
యాలకుల పొడి - కొద్దిగా
కాచిన పాలు - 2 కప్పులు
 
తయారీ విధానం:
ముందుగా బాదం పప్పులను వేడినీళ్లల్లో నానబెట్టి వాటి తొక్కలను తీసేయాలి. ఆ తరువాత యాపిల్‌ తొక్కలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాదం పప్పులను, యాపిల్ ముక్కలను మిక్సీలో మెత్తగా రుబ్బుకుని అందులో కొద్దిగా యాలకుల పొడి కలుపుకోవాలి. అంతే... స్వీట్ బాదం చిల్లీ రెడీ.