శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (11:05 IST)

మధుమేహాన్ని దూరం చేసే క్యాప్సికమ్‌తో బజ్జీ ఎలా చేయాలి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యాప్సికమ్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలను సులువుగా తగ్గించుకోవచ్చు. ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పిత్తి చేసే చర్యలను ఇది ప్రోత్సహిస్తుంది. క్యాప్సికమ్‌లోని వి

మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యాప్సికమ్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలను సులువుగా తగ్గించుకోవచ్చు. ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పిత్తి చేసే చర్యలను ఇది ప్రోత్సహిస్తుంది. క్యాప్సికమ్‌లోని విటమిన్ సి, ఫైటో కెమికల్స్ ఆస్తమాను తగ్గించేందుకు ఉపయోగపడడంతోపాటు ఇవి మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. ఎముకలను బలంగా వుంచుతాయి. 
 
కొలెస్ట్రాల్‌ను తగ్గించే క్యాప్సికమ్ గుండెపోటు, హృద్రోగ సంబంధిత రోగాలను నయం చేస్తుంది. వారానికి రెండు సార్లు తీసుకుంటే జలుబు, జ్వరం వంటివి దరి చేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి క్యాప్సికమ్‌ను పిల్లలు ఇష్టపడి తినే బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం.. వర్షాకాలంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
కాప్సికమ్ - అర కేజి.
జీలకర్ర - ఒక స్పూను. 
వంటసోడా - చిటికెడు. 
శనగపిండి - పావు కేజి.  
మిరప్పొడి - ఒక స్పూను. 
నూనె - పావు కేజి. 
ఉప్పు - తగినంత. 
 
తయారీ విధానం :
ముందుగా క్యాప్సికమ్‌లను బాగా కడిగి ఒక్కొక్క దాన్ని నాలుగైదు ముక్కలుగా నిలువుగా తరుక్కోవాలి. గింజలు, తొడిమ తీసేయాలి. ఆ తర్వాత శనగపిండిలో ఉప్పు, కారం, జీలకర్ర, వంటసోడా అన్నీ వేసి బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి. స్టౌ మీద బాణలి ఉంచి నూనె పోసి ఒక్కొక్క కాప్సికమ్ ముక్కను శనగపిండిలో ముంచి కాగిన నూనెలో వెయ్యాలి. వేగాక తీసి చిల్లీసాస్‌తో వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.