ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : శుక్రవారం, 12 అక్టోబరు 2018 (12:27 IST)

నిద్రలేమికి చెక్ పెట్టే.. ఆనియన్ మసాలా.. ఎలా..?

కొందరికి నిద్ర సరిగ్గా పట్టదు. అందుకు వైద్య చికిత్సలు రకరకాల మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎటువంటి లాభం లేదని బాధపడుతుంటారు. ఇలా చేస్తే తప్పకుండా మంచి నిద్రపడుతుంది. ఎలా అంటే.. ఉల్లిపాయను నీటిలో వేసి వేడి చేసుకోవాలి. ఆ నీటిలో కొద్దిగా చక్కెర కలుపుకుని తీసుకుంటే నిద్రలేమి సమస్య నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
 
అలానే ఉల్లిపాయలను పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి గోరువెచ్చని నీటిలో ఈ మిశ్రమం కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇటువంటి ఉల్లిపాయలతో మసాలా ఎలా చేయాలో తెలుసుకుందాం. 
 
కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు - 3
పచ్చిమిర్చి - 3
వెల్లుల్లి రెబ్బలు - 4
టమోటాలు - 3
పసుపు - కొద్దిగా
కొబ్బరినూనె - 2 స్పూన్స్
జీలకర్ర - 1 స్పూన్
మెంతులు - 1 స్పూన్
అల్లం - చిన్నముక్క
ఆవాలు - 1 స్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
కొత్తిమీర - 1 కప్పు
ఉప్పు - సరిపడా
గరం మసాలా - 1 స్పూన్.
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనెను వేడిచేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి కాసేపు వేయించి తరువాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో అల్లం, వెల్లుల్లి వేసి కాసేపు వేయించి టమోటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కారం, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర వేసి 3 నిమిషాల పాటు వేయించుకుంటే ఘుమఘుమలాడే ఆనియన్ మసాలా రెడీ.