మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : బుధవారం, 10 అక్టోబరు 2018 (14:31 IST)

చికెన్‌ పులావ్ ఇలా చేస్తే అదిరిపోతుంది...

చికెన్‌తో పకోడీలు, సూప్‌లు, ఫ్రై, మంచురీయా ఇంకా రకరకాల వంటలు తయారుచేస్తుంటారు. చికెన్‌తో పులావ్ చేసుకోవచ్చు. మరి వీటి రుచితో పాటు పులావ్ రుచి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
బాస్మతీ రైస్ - 4 కప్పులు
ఉల్లిపాయలు - 2
చికెన్ ముక్కలు - 1 కప్పు
బిర్యానీ ఆకులు - 2
జీలకర్ర - 1 స్పూన్
గరం మసాలా - 1 స్పూన్
యాలకులు - 2
మిరియాలు - 1 స్పూన్
దాల్చినచెక్క - చిన్నముక్క
ఉప్పు - తగినంతా
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాసేపు వేయించుకుని ఆ తరువాత జీలకర్ర, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి కలుపుకుని తరువాత చికెన్ ముక్కలు వేసి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా నానబెట్టిన బియ్యాన్ని ఆ మిశ్రమంలో వేసి 20 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే... వేడివేడి చికెన్ పులావ్ రెడీ.