శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (15:21 IST)

ప్రతిరోజూ వేడినీళ్లు తీసుకుంటే..?

మధుమేహ వ్యాధితో బాధపడేవారు వైద్యచికిత్సల ద్వారా దొరికిన మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎటువంటి లాభం ఉండదు. వేడి నీటిని ప్రతిరోజూ తీసుకుంటే మధుమేహం వ్యాధి దరిచేరదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి భోజనం చేసిన తరువాత గ్లాస్ వేడినీళ్లు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగపడుతుంది.
 
కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా.. అయితే ఇలా చేయండి.. వేడినీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి అరగంట పాటు పాదాలను ఆ నీటిలో ఉంచుకోవాలి. ప్రతిరోజు ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ వేడినీళ్లు తీసుకుంటే మంచిది. అలానే అధిక బరువు కూడా తగ్గుతారు. వేడినీటిని తాగితే రోజంతా చురుగ్గా ఉంటారు. శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటకుపంపుతుంది.