మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (14:34 IST)

నిద్రలేమి వలన ఏర్పడే సమస్యలివే..

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ 6 నుండి 8 గంటల పాటు కచ్చితంగా నిద్రించాలి. కానీ ఇప్పటి కాలంలో ఉరుకుల పరుగుల జీవితాన్ని అనుభవిస్తున్నారు. దాంతో నిద్రకు కొద్ది సమయం కూడా దొరకగడం లేదు. కొందరైతే దీనికి తోడుగా స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇలా వీటి మధ్యలో చిక్కుకుపోయి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
 
మనిషికి నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతారు. కనుక వీలైనంత వరకు తగినన్ని గంటల పాటు కచ్చితంగా నిద్రిస్తే మంచిది. లేదంటే పలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అవేంటో తెలుసుకుందాం. రాత్రివేళ నిద్ర సరిగ్గా పోకపోతే మరుసటి రోజు ఈ సమస్య వలన నిద్రమత్తు రోడ్డు ప్రమాదాలకు గురిచేస్తుంది.

నిద్రలేమి శరీర రోగనిరోధక శక్తిని క్షీణింపజేస్తుంది. తద్వారా హైబీపీకి లోనవుతారు. నిద్ర లేకపోతే గుండె వ్యాధులు, ఎముకలు బలం కోల్పోయి పెళుసుగా మారిపోతాయి. దాంతో మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమి వలన మెదడుపై ప్రభావం చూపుతుంది. దాంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఏకాగ్రతను కోల్పోతారు. ఏ విషయంలోను సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకాదు.