మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (12:20 IST)

కాకరకాయ జ్యూస్‌తో.. మధుమేహ వ్యాధి..?

కాకరకాయ చేదుగా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరికి కాకరకాయ అంటేనే నచ్చదు. మరికొందరి ఇది ప్రాణం. దీనిని చక్కెర వేసుకుని తింటుంటారు కొందరు.

కాకరకాయ చేదుగా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరికి కాకరకాయ అంటేనే నచ్చదు. మరికొందరి ఇది ప్రాణం. దీనిని చక్కెర వేసుకుని తింటుంటారు కొందరు. కాకరకాయ చేదును తొలగించాలంటే వీటిల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని శుభ్రం చేసుకోవాలి. అప్పుడు చేదు ఉండదు. కాకరకాయను జ్యూస్ రూపంలో తీసుకుంటే మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
ఈ జ్యూస్‌ను తీసుకోవడం వలన కొందరికి వాంతులవుతాయి. మరికొందరికి విరేచనాలవుతాయి. ఎందుకంటే వారు మెుదటి నుండి చేదు పదార్థాలు తీసుకోకుండా మిగిలిన అన్ని పదార్థాలు తీసుకోవడమే అందుకు కారణం. అందువలన ప్రతిరోజూ కొద్దికొద్దిగా కాకరకాయ జ్యూస్ తీసుకుంటే మంచిది. ఈ జ్యూస్‌ను సేవిస్తే మధమేహ వ్యాధిని అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.