1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (14:25 IST)

దానిమ్మ పండు రసం లేదా విత్తనాలు... ఏవి బెస్ట్?

దానిమ్మలో విటమిన్ ఎ, సి, బి5, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. గర్భిణులు దానిమ్మను తరచుగా డైట్‌లో చేర్చుకుంటే శిశువు పెరుగుదలకు మంచిగా సహాయపడుతుంది. వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది.

దానిమ్మలో విటమిన్ ఎ, సి, బి5, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. గర్భిణులు దానిమ్మను తరచుగా డైట్‌లో చేర్చుకుంటే శిశువు పెరుగుదలకు మంచిగా సహాయపడుతుంది. వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. అల్జీమర్స్, బ్రెస్ట్, స్కిన్ వంటి క్యాన్సర్ వ్యాధులను నివారిస్తుంది. రక్తప్రసరణకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
 
ఎముకల బలాన్ని పెంచుటకు దానిమ్మ జూస్య్ చక్కగా దోహదపడుతుంది. ఈ దాన్నిమ్మ ఆరోగ్యానికి, అందానికి మంచి ఔషధం. ఇందులోని విటమిన్స్ కంటి చూపును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. గర్భిణుల ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తహీనతను తగ్గిస్తుంది. దానిమ్మను జూస్య్ రూపంలో కాకుండా అలానే తీసుకుంటే మంచిది. ఎందుకంటే సహజసిద్ధంగా దొరికే ఈ దానిమ్మలో విటమిన్స్ అధికంగా ఉంటాయి. 
 
దానిమ్మను జ్యూస్ రూపంలో తీసుకోవడం వలన ఆ విటమిన్స్ స్థాయిలు తగ్గిపోతాయి. దాంతో శరీరానికి కావలసిన విటమిన్స్ లభించవు. కనుక వీలైనంత వరకు అలానే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.