1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. health benefits of peanuts

వేరుశెనగ పప్పుతో ఇవన్నీ...

వేరుశెనగ పప్పులు ఈ కాలంలో ఎక్కువగా దొరకుతాయి. బస్సుల్లో, రైళ్ళల్లో ఇంకా ఎక్కడ చూసిన వీటినే అమ్ముతుంటారు. వేరుశెనగ పప్పులో విటమిన్ బి1, బి6, ఫోలిక్ యాసిడ్, మెగ్నిషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్న

peanuts
వేరుశెనగ పప్పులు ఈ కాలంలో ఎక్కువగా దొరకుతాయి. బస్సుల్లో, రైళ్ళల్లో ఇంకా ఎక్కడ చూసిన వీటినే అమ్ముతుంటారు. వేరుశెనగ పప్పులో విటమిన్ బి1, బి6, ఫోలిక్ యాసిడ్, మెగ్నిషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తరచుగా ఆహారంలో చేర్చుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
ఈ వేరుశెనగ పప్పులలో రకరకాల వంటకాలు కూడా తయారుచేసుకుంటారు. వీటిని కూర రూపంలో తీసుకుంటే కూడా మంచిదే. కానీ, వేరుశెనగల్లోని విటమిన్స్ పోషక విలువలు వాటిని కూరగా తీసుకున్నప్పుడు శరీరానికి చాలా తక్కువగా లభిస్తాయి. కనుక వీలైనంత వరకు వీటిని కూరలా కాకుండా అలానే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
వేరుశెనగ పప్పులు తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులు వంటి సమస్యలు దరిచేరవని చెబుతున్నారు. ముఖ్యంగా పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయని ఇటీవల శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలోని కొవ్వును, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుటకు చక్కగా పనిచేస్తుంది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
తేనే కదాని తేలికగా తీసుకునేరు..