శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (10:56 IST)

పచ్చి టమోటాలు తీసుకుంటే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

టమోటాలు ఎక్కువగా వంటకాల్లో వాడుతుంటారు. టమోటా లేని కూర లేదు. ఏ వంటకం చేయాలన్నా టమోటాలు చాలా అవసరం. ఈ టమోటాలతో అందానికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టమోటాను కూర రూపంలోనే కాకుండా పచ్చిగా కూడా తీసు

టమోటాలు ఎక్కువగా వంటకాల్లో వాడుతుంటారు. టమోటా లేని కూర లేదు. ఏ వంటకం చేయాలన్నా టమోటాలు చాలా అవసరం. ఈ టమోటాలతో అందానికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టమోటాను కూర రూపంలోనే కాకుండా పచ్చిగా కూడా తీసుకోవచ్చును. ఎందుకంటే పచ్చి టమోటాలో గల పోషక విలువలు కూరలో అంతంగా ఉండవు. కనుక వీలైనంత వరకు పచ్చిగా తీసుకుంటే మంచిది.
 
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. డయేరియాను నివారిస్తుంది. పచ్చకామెర్ల వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ ఒక టమోటాను తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. రేటీకటిని తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరచుటకు చక్కగా ఉపయోగపడుతుంది. రక్తపోటు వ్యాధి నియంత్రణలో ఉంటుంది. టమోటాలు తీసుకోవడం వలన శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. 
 
ఇందులోని విటమిన్ బి6, పొటాషియం, మాంగనీస్, మెగ్నిషియం, పాస్పరస్ వంటి ఖనిజాలు కడుపులోని అల్సర్‌ను నివారిస్తాయి. టమోటాలోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపుతుంది. టమోటా జ్యూస్ తాగడం వలన గాల్‌స్టోన్స్ సమస్యలు ఉండవు. టమోటా తీసుకుంటే దంతాలు, చర్మం, జుట్టు, ఎముకలకు ఎంతో మంచిది.