మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (10:35 IST)

సజ్జల్లోని క్యాల్షియం... తల్లిపాలు వృద్ధి...?

సజ్జల్లో ప్రోటీన్స్, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ విటమిన్స్, వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. సజ్జల్లో గల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. సజ్జల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్, గుండె

సజ్జల్లో ప్రోటీన్స్, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్ విటమిన్స్, వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. సజ్జల్లో గల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. సజ్జల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధుల నుండి కాపాడుతాయి. పిల్లలకు సజ్జలను పొడిచేసి ఫుడ్‌గా పెట్టొచ్చు.  ఎందుకంటే ఇవి జ్ఞాపకశక్తిని పెంచుటకు సహాయపడుతాయి.
 
సజ్జలు శరీరంలో ఐరన్ లోపాన్ని, రక్తహీనతను తగ్గిస్తాయి. శరీరంలో ఐరన్ లోపం ఉంటే మానసిక పెరుగుదల క్షీణిస్తుంది. అంతేకాకుండా తొందరగా అలసిపోతుంటారు. ముఖ్యంగా ఈ సమస్యలను స్త్రీలే అధికంగా ఎదుర్కుంటున్నారు. ఈ సజ్జలు తీసుకోవడం వలన ఇటువంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లోని ఫైబర్ జీర్ణశక్తిని పెంచుతుంది. 
 
సజ్జలు తీసుకోవడం వలన తొందరగా ఆకలి వేయదు. దీని ఫలితంగా శరీరం తీసుకునే క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. మలబద్ధకాన్ని పోగొడుతాయి. నిత్యం పాలలో సజ్జలను ఏదో ఒక రూపంలో తీసుకుంటే శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి. వీటిని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే తలనొప్పి, అలసట ఉండదు. 
 
పాలిచ్చే తల్లులు డైట్‌లో సజ్జలు చేర్చుకుని తీసుకోవడం వలన తల్లిపాలు వృద్ధి చెందుతాయి. ఎందుకంటే పాలలో ఉన్న క్యాల్షియం కంటే మూడురెట్లు క్యాల్షియం సజ్జల్లో ఉంటాయి. కనుక డైట్‌లో వీటిని క్రమంగా ఆహారంలో చేర్చుకుంటే మంచిది. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులకు, తదితర సమస్యలకు సజ్జలు తీసుకుంటే మంచి పరిష్కారం లభిస్తుంది.