1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Amazing health benefits of drumstick leaves

మునక్కాయ పొట్టులో నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే?

ఈ కాలంలో మునక్కాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి. మునక్కాయ, మునగ ఆకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. వీటిల్లో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. జలుబుతో బాధపడేవారు మునక్కాడల సూప్ తీసుకుంటే వెంటనే ఉ

drumstick
ఈ కాలంలో మునక్కాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి. మునక్కాయ, మునగ ఆకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. వీటిల్లో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. జలుబుతో బాధపడేవారు మునక్కాడల సూప్ తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. టీబీ వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధుల నుండి కాపాడుతుంది.

 
ఈ మునక్కాయలోని ఐరన్, క్యాల్షియం, విటమిన్స్ వంటి ఖనిజాలు ఎముకల బలానికి చాలా ఉపయోగపడుతాయి. రక్తాన్ని శుభ్రం చేస్తాయి. గర్భిణులు మునగ ఆకులతో చేసిన వంటకాలు తీసుకోవడం వలన తల్లిపాలు వృద్ధి చెందుతాయి. మునగ ఆకుల్లో కొద్దిగా ఉప్పువేసి నీళ్లల్లో ఉడికించుకుని నీళ్లను వార్చేసి ఉడికిన మునగాకులో కాస్త నెయ్యి వేసుకుని తీసుకుంటే బాలింతలకు చాలా మంచిది. 
 
మునగకాయల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని ఇన్‌ఫెక్షన్స్‌ను తొలగిస్తాయి. ముఖ్యంగా గొంతు, చర్మం, ఛాతీ ఇన్‌ఫెక్షన్స్ వంటి సమస్యలు రావు. జీర్ణవ్యవస్థను మెరుగుపడుతుంది. కలరా, జాండిస్, విరేచనాలు వంటి సమస్యలు కొద్దిగా మునగ ఆకుల జ్యూస్‌లో తేనెను కలుపుకుని ఆ మిశ్రమాన్ని కొబ్బరి నీళ్ళల్లో కలిపి ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. 
 
మునక్కాయ పొట్టులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే పులిపిరులు, చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. తరచుగా మునక్కాయలను, మునగ ఆకులు ఆహారంలో చేర్చుకోవడం వలన పెద్దప్రేగు ట్యూమర్లు రాకుండా నిరోధిస్తుంది. గర్భాశయంపై వచ్చే కంతుల పరిమాణాన్ని తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో చక్కెర ప్రమాణాలు పెరగకుండా కాపాడుతాయి. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
పాలతో కిస్‌మిస్ పండ్లు తింటే... పురుషులకు ఆ శక్తి అపారం...