ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 22 సెప్టెంబరు 2018 (11:00 IST)

కమలాపండు జ్యూస్‌తో అధిక రక్తపోటుకు చెక్....

వర్షాకాలంలో అధికంగా దొరికే కమలాపండులో ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే గుణాలు ఎన్నో ఉన్నాయి. కఫం, వాతం, అజీర్తి వంటి ఆరోగ్య సమస్యల నుండి ఇది కాపాడుతుంది. శరీరానికి కావలసిన బలాన్ని, తేజస్సును ఇస్తుంది. అధిక

వర్షాకాలంలో అధికంగా దొరికే కమలాపండులో ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే గుణాలు ఎన్నో ఉన్నాయి. కఫం, వాతం, అజీర్తి వంటి ఆరోగ్య సమస్యల నుండి ఇది కాపాడుతుంది. శరీరానికి కావలసిన బలాన్ని, తేజస్సును ఇస్తుంది. అధిక రక్తపోటు కారణంగా చాలా మరణిస్తున్నారు. ఈ ముప్పును అధిగమించాలంటే రోజుకు రెండు గ్లాసుల కమలాపండు రసాన్ని తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
కమలాపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ పండులోని క్షారగుణం ఎసిడిటీని తగ్గిస్తుంది. సంతాన సాఫల్యతను కలిగించే గుణాలు కమలాపండులో ఎక్కువగా ఉన్నాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతిరోజూ కమలాపండు రసాన్ని తీసుకుంటే నెల రోజుల్లో రక్తపోటు నియంత్రణకు వస్తుంది. క్యాన్సర్ వ్యాధులను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ పండులో సమృద్ధిగా ఉన్నాయి. 
 
ఈ కమలా తొక్కను ఎండబెట్టుకుని పొడిచేసి సున్నిపిండితో కలుపుకుని స్నానం చేస్తే చర్మానికి చాలా మంచిది. మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచే గుణం కమలాపండులో అధికం. ఆస్తమా, క్షయ వ్యాధిగ్రస్థులకు కమలాపండు దివ్యౌషధం. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇందులో అధికంగా ఫోలిక్ యాసిడ్ మెదడుని ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచుతుంది.