ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (15:09 IST)

'ది ఐరన్ లేడీ' జయలలిత బయోపిక్.. అమ్మగా వరలక్ష్మి శరత్ కుమార్

తమిళనాడు దివంగత మఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ త్వరలో రానుంది. ఎన్‌టీఆర్‌ జీవితచరిత్రను సినిమాగా నిర్మిస్తున్న విబ్రి మీడియానే ఈ చిత్రాన్ని నిర్మించనుంది. జయలలిత జన్మదినమైన ఫిబ్రవరి 24న షూటింగ్‌ ప్రారంభిం

తమిళనాడు దివంగత మఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ త్వరలో రానుంది. ఎన్‌టీఆర్‌ జీవితచరిత్రను సినిమాగా నిర్మిస్తున్న విబ్రి మీడియానే ఈ చిత్రాన్ని నిర్మించనుంది. జయలలిత జన్మదినమైన ఫిబ్రవరి 24న షూటింగ్‌ ప్రారంభించి, ఫస్ట్‌లుక్‌ విడుదల చేయనున్నట్లు తెలిసింది. 'మద్రాసపట్టణం' అనే గొప్ప చిత్రాన్ని తీసిన ఏఎల్‌ విజయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని, తమిళం, తెలుగు, హిందీలో విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు.
 
నిజానికి జయలలిత అటు వెండితెరపైనేకాకుండా.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తమిళ ప్రజలకు అమ్మగా.. కోట్లాది ప్రజలకు దేవతగా... జయలలిత చేసిన సేవలను ఎన్నటికీ తమిళనాట చెరగని ముద్రనే. జయ జీవితం పూలపాన్పేమీ కాదు. ఎన్నో ఒడిదుడుకులను ఆమె ఎదుర్కొన్నారు. అందుతే ఆమె జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్నారు.
 
ఆమె జీవితాన్ని బయోపిక్‌గా తీసుకురావడానికి దాదాపు ఐదుగురు డైరెక్టర్లు ముందుకు వచ్చారు. వారిలో ఒకరు ప్రియదర్శిని. ప్రియదర్శిని డైరెక్ట్‌ చేయబోయే అమ్మ బయోపిక్‌ టైటిల్‌ పేరును, ఫస్ట్‌ లుక్‌ను డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్ ఆవిష్కరించారు.
 
జయలలిత బయోపిక్‌ 'ది ఐరన్‌ లేడి' టైటిల్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేయడం చాలా సంతోషంగా, ఉత్తేజితంగా ఉంది. ప్రియదర్శిని, టీమ్‌ గ్రాండ్‌ సక్సెస్‌ సాధించాలని ఆశిస్తున్నా అంటూ ఏఆర్‌ మురుగదాస్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా త్వరలోనే చాలా గ్రాండ్‌గా జరగనుందని కూడా ప్రకటించారు. 
 
ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించబోతున్నారు. కోట్లాది ప్రజల హృదయాల్లో ఇప్పటికీ సజీవంగా నిలిచిన అమ్మ చిత్రం 'ది ఐరన్‌ లేడి' గురించి గత నాలుగు నెలలుగా చర్చిస్తూనే ఉన్నామని ప్రియదర్శిని తెలిపారు.