శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: శనివారం, 15 సెప్టెంబరు 2018 (13:36 IST)

మ‌న్మ‌థుడు 2లో హీరో ఎవ‌రో బ‌య‌ట పెట్టిన చైతు

టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని సినిమాల్లో మ‌న్మ‌థుడు ఒక‌టి. 2002లో రిలీజైన ఈ సినిమాకి త్రివిక్ర‌మ్ క‌థ - మాటలు అందించ‌గా విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని సంచ‌ల‌న విజ‌యం సాధించిం

టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని సినిమాల్లో మ‌న్మ‌థుడు ఒక‌టి. 2002లో రిలీజైన ఈ సినిమాకి త్రివిక్ర‌మ్ క‌థ - మాటలు అందించ‌గా విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇదిలావుంటే.. ఇటీవ‌ల అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పైన మ‌న్మ‌థుడు 2 అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించారు. దీంతో మ‌న్మ‌థుడు 2లో న‌టించే హీరో ఎవ‌రు..? నాగార్జున న‌టిస్తాడా..? లేక చైత‌న్య‌, అఖిల్ కోసం ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించారా అనేది ఆస‌క్తిగా మారింది.
 
అయితే... శైల‌జారెడ్డి అల్లుడు ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన చైత‌న్య మ‌న్మ‌థుడు 2పై క్లారిటీ ఇచ్చాడు. ఇంత‌కీ ఏమ‌న్నాడంటే.. మ‌న్మ‌థుడు 2 అనే టైటిల్ నాన్న కోసమే అని తేల్చేసాడు. ఈ చిత్రానికి చి.ల.సౌ డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని.. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని చెప్పాడు. సో... రాహుల్ ర‌వీంద్ర‌న్ త‌దుప‌రి చిత్రం నాగార్జున‌తోనన్నమాట. దీని టైటిల్ మ‌న్మ‌థుడు 2.