శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (11:03 IST)

షాకింగ్... స‌మంత సినిమా చూడ‌ద్దంటోన్న నాగ చైత‌న్య‌..!

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన తాజా చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ న‌టించ‌డం.. ట్రైల‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ రావ‌డం.. వినాయ‌క చ‌వితికి రిలీజ్ అవుతుండ‌టం... వీట‌న్నింటి వ‌ల్ల శైల‌జారెడ్డి అల్లుడు

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన తాజా చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ న‌టించ‌డం.. ట్రైల‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ రావ‌డం.. వినాయ‌క చ‌వితికి రిలీజ్ అవుతుండ‌టం... వీట‌న్నింటి వ‌ల్ల శైల‌జారెడ్డి అల్లుడు సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఖ‌చ్చితంగా చైత‌న్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంద‌నే టాక్ వినిపిస్తోంది. అయితే... ఈ సినిమా రిలీజ్ అవుతున్న రోజునే స‌మంత యూ ట‌ర్న్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. 
 
ఇదే విష‌యం గురించి చైత‌న్య‌ని అడిగితే... ప్రేక్ష‌కులంద‌ర్నీ ఫ‌స్ట్ నా సినిమానే చూడ‌మ‌ని చెబుతాను. స‌మంత సినిమా త‌ర్వాత చూడండి అంటున్నాడు. ఇలా అన‌డానికి కార‌ణం ఏంటంటే.. స‌మంత సినిమాలు ఈ సంవ‌త్స‌రంలో రంగ‌స్థలం, మ‌హాన‌టి సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం.. బ్లాక్‌బ‌ష్ట‌ర్ అవ్వ‌డం తెలిసిందే. ఈ సంవ‌త్స‌రం త‌న సినిమా ఒక‌టి కూడా రిలీజ్ కాలేదు. అందుచేత ఫ‌స్ట్ నా సినిమా చూడండి. త‌ర్వాత స‌మంత సినిమా చూడండ‌ని చెబుతున్నాడు. చైత‌న్య చెప్పిన లాజిక్ బాగుంది.