శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By srinivas
Last Modified: శుక్రవారం, 31 ఆగస్టు 2018 (17:16 IST)

శైల‌జారెడ్డి అల్లుడు ఏ ముహుర్త‌న ప్రారంభించారో కానీ...

యువ స‌మ్రాట్ అక్కినేని నాగచైతన్య - యువ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు. సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన ఈ చిత్రాన్ని నాగ‌వంశీ నిర్మించారు. ఏ ముహుర్త‌న ఈ చిత్రాన్ని ప్రారంభించారో కానీ.. ఏదీ కలిసి ర

యువ స‌మ్రాట్ అక్కినేని నాగచైతన్య - యువ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు. సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన ఈ చిత్రాన్ని నాగ‌వంశీ నిర్మించారు. ఏ ముహుర్త‌న ఈ  చిత్రాన్ని ప్రారంభించారో కానీ.. ఏదీ కలిసి రావడం లేదు. ఈ చిత్రం ఆగస్టు 31 న విడుదల కావాల్సి ఉండగా ఇటీవల కేరళలో వరదల కారణంగా చిత్ర రీ రికార్డింగ్ పనులు లేట్ అయ్యాయి. ఆ ప్రభావం కాస్త రిలీజ్ డేట్ మీద పడింది. దాంతో ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 31 నుంచి సెప్టెంబ‌ర్ 13కి వాయిదా ప‌డింది.
 
ఆగ‌ష్టు 29న శైల‌జారెడ్డి అల్లుడు ట్రైలర్ రిలీజ్ చేయాలి అనుకున్నారు. నందమూరి హరికృష్ణ  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కారణంగా ట్రైలర్ ఈరోజు విడుదల చేయట్లేదని త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసింది. దీంతో అస‌లు శైల‌జారెడ్డి అల్లుడు సినిమాకి ఏమైంది.? ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వ‌స్తుంది అంటూ తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు అభిమానులు.