శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 21 ఆగస్టు 2018 (21:30 IST)

కేరళ వరదలతో 'శైల‌జారెడ్డి అల్లుడు' రాలేకపోతున్నాడు... ఇది నిజం

అక్కినేని నాగ చైత‌న్య - మారుతి కాంబినేష‌న్లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ శైల‌జారెడ్డి అల్లుడు. సితార ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ పైన నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల 31న శైల‌జారెడ్డి అల్లుడు రిలీజ్ అని అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అక్కినేని నాగ చైత‌న్య - మారుతి కాంబినేష‌న్లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ శైల‌జారెడ్డి అల్లుడు. సితార ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ పైన నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల 31న శైల‌జారెడ్డి అల్లుడు రిలీజ్ అని అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే.. గోపీ సుంద‌ర్‌తో రీ-రికార్డింగ్ చేయించేందుకు మారుతి కేర‌ళ వెళ్లారు. మ‌నం ఒక‌టనుకుంటే.. పైవాడు ఇంకొక‌టి అనుకున్నాడు. కేర‌ళ‌కు వ‌ర‌ద‌లొచ్చాయి. క‌రెంట్ క‌ట్.. దీంతో రీ-రికార్డింగ్ చేయ‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. 
 
దీనికితోడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ బంధువులు కూడా వ‌ర‌ద‌ల్లో చిక్కుకోవ‌డంతో వ‌ర్క్ చేయ‌లేని ప‌రిస్థితి. దీంతో ఏం చేయ‌లేని ప‌రిస్థితుల్లో సినిమాని వాయిదా వేసారు. ఈ విష‌యాన్ని నాగ చైత‌న్య ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ... త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ఎప్పుడ‌నేది ఎనౌన్స్ చేస్తామ‌ని తెలియ‌చేసారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. సెప్టెంబ‌ర్ 7న శైల‌జారెడ్డి అల్లుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది.