శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (10:11 IST)

ఎలాంటి సాయం కావాలో చెప్పండి.. ఫ్యాన్స్‌ను కోరుతున్న కీర్తి సురేష్

కేరళ వరద బాధితులను ఆదుకునే విషయంలో ఇతర హీరోయిన్లతో పోల్చితే మలయాళ భామ కీర్తి సురేష్ ఒక అడుగు ముందున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తనవంతు సాయంగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని ప్

కేరళ వరద బాధితులను ఆదుకునే విషయంలో ఇతర హీరోయిన్లతో పోల్చితే మలయాళ భామ కీర్తి సురేష్ ఒక అడుగు ముందున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తనవంతు సాయంగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించిన ఆమె.. మరో రూ.5 లక్షలను మందులు, నిత్యావసరవస్తు సామాగ్రి కొనుగోలుకు ఖర్చు చేస్తున్నారు.
 
అంతేకాకుండా, వరద బాధితులను ఆదుకునేందుకు ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. త్రివేండ్రంలోని ఓ కళాశాల నుంచి కీర్తీ బాధితులకు అవసరమైన వస్తువులను అందిజేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా షేర్ చేస్తోంది. అంతేకాక బాధితులకు ఏయే వస్తువులుకావాలో లైవ్ వీడియోల ద్వారా అభిమానులను కోరుతుంది. దీంతో కీర్తీ చేస్తున్న ఈ గొప్ప పనుల్ని, ఆమె గొప్ప మనస్సును మొచ్చుకుంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.