శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (16:19 IST)

బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్న నాలుగు చిత్రాలు...

తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ శక్రవారం నాలుగు చిత్రాలు పోటీపడనున్నాయి. 'ఆట‌గాళ్ళు', 'నీవెవ‌రో', 'ల‌క్ష్మీ', 'అంత‌కుమించి' అనే చిత్రాలు శుక్రవారం గ్రాండ్‌గా విడుదలకానున్నాయి.

తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ శక్రవారం నాలుగు చిత్రాలు పోటీపడనున్నాయి. 'ఆట‌గాళ్ళు', 'నీవెవ‌రో', 'ల‌క్ష్మీ', 'అంత‌కుమించి' అనే చిత్రాలు శుక్రవారం గ్రాండ్‌గా విడుదలకానున్నాయి.
 
నారా రోహిత్‌, జ‌గ‌ప‌తి బాబు ప్ర‌ధాన పాత్ర‌లో 'ఆట‌గాళ్ళు' అనే చిత్రం తెరకెక్కింది. ఆ తర్వాత ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో "నీవెవ‌రో" సినిమా రూపొందింది. ఈ రెండు సినిమాల‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 
 
ఇకపోతే, ప్ర‌భుదేవా న‌టించిన "ల‌క్ష్మీ" చిత్రంపై కూడా అభిమానుల‌లో ఆస‌క్తి నెల‌కొంది. ఇకపోతే, త‌న అదృష్టం పరీక్షించుకుంటున్న ర‌ష్మీ "అంత‌కుమించి" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
కాగా, ఈ యేడాది ప్ర‌థ‌మార్ధంలో టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. 'రంగ‌స్థ‌లం', 'భ‌ర‌త్ అనే నేను', 'మ‌హానటి' వంటి చిత్రాలు విడుదలై మంచి సక్సెస్‌ను సాధించారు. 
 
ఇక ద్వితీయార్థంలో పెద్ద సినిమాల హ‌డావిడి ఏమి లేక‌పోయిన చిన్న సినిమాలు మాత్రం అభిమానుల‌కి ప‌సందైన విందు అందిస్తున్నాయి. 'ఆర్‌ఎక్స్ 100', 'గూఢాచారి', 'చిల‌సౌ', 'గీత గోవిందం' వంటి చిత్రాలు ఇటీవల విడుద‌లై భారీ విజ‌యాన్ని సాధించాయి. ఈ శుక్రవారం నాలుగు చిత్రాలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.