సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 1 సెప్టెంబరు 2018 (13:43 IST)

అందమైన అమ్మాయిలు వుంటే అత్యాచారాలు జరుగుతూనే వుంటాయి...

అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పటికే చాలామంది చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టి కూడా చేరిపోయారు. అత్యాచారాలపై ఆయనకు మీడియా ప్రశ్నలు వేయగా వివాదాస్పద రీతిలో జవాబు చెప్పారు. దావో నగరంలో రేప్ ఘటనలు ఎక్కువ జరుగు

అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పటికే చాలామంది చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టి కూడా చేరిపోయారు. అత్యాచారాలపై ఆయనకు మీడియా ప్రశ్నలు వేయగా వివాదాస్పద రీతిలో జవాబు చెప్పారు. దావో నగరంలో రేప్ ఘటనలు ఎక్కువ జరుగుతున్నాయంటూ సమావేశంలో చర్చ జరుగుతుండగా ఆయన మాట్లాడుతూ.. అందమైన అమ్మాయిలు వున్నంతవరకూ అత్యాచారాలు ఆగే అవకాశం లేదని అన్నారు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. 
 
ఐతే ఆయన మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రోడ్రిగో వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఆయన మాత్రం తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేలా కనిపించడంలేదు.